Studio18 News - తెలంగాణ / : ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన కోరారు. ఒక పార్టీ నుంచి గెలిచి... అధికారం కోసం పార్టీ మారడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారని... ఆరు నెలలు తిరగక ముందే ఇంకొక (కాంగ్రెస్ పార్టీ) తరపున ఎంపీగా పోటీ చేశారని అన్నారు. రాజీనామాలు చేయకుండా పార్టీ మారిన ఫిరాయింపుదారులు అధికారాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు... అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ కూడా ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీని మారిన వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ లను బీఆర్ఎస్ కోరింది.
Admin
Studio18 News