Saturday, 14 March 2026 09:49:15 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మల్‌రెడ్డి రాంరెడ్డి

Date : 11 March 2026 05:50 PM Views : 5

Studio18 News - TELANGANA / RANGAREDDY : ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలి, సమాజంలో గౌరవంగా జీవించాలి, మహిళలందరి ముఖంలో చిరునవ్వు ఉండాలని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కందికంటి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌లోని గౌడ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవా రంగంలో అంకితభావంతో పనిచేస్తున్న మహిళల కృషిని గుర్తిస్తూ మహిళా పోలీసులను మరియు జీహెచ్ఎంసీ మహిళా కార్మికులను శాలువాలు కప్పి సన్మానించారు. సమాజ శ్రేయస్సు కోసం వారు నిర్విరామంగా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అభినందిస్తూ, వారి సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రతి ఒక్కరూ అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారత కుటుంబానికి వెలుగుదీపిక వంటిదని, సమాజంలో స్త్రీలు గౌరవంగా జీవించాలంటే విద్యా, ఉపాధి రంగాల్లో వారు ముందుకు రావాలని పేర్కొన్నారు. స్త్రీ శక్తి సమాజానికి బలం అని, స్త్రీ సాధికారతే అభివృద్ధికి మార్గమని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతను లక్ష్యంగా తీసుకుని ఆడబిడ్డల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించేందుకు హైటెక్ సిటీలో ఇందిరా మహిళా శక్తి బజారు ఏర్పాటు చేసి 140కి పైగా స్టాల్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన గ్రామీణ కుటీర పరిశ్రమల ఉత్పత్తులను మధ్యవర్తులు లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే గడిచిన రెండున్నరేళ్లలో డ్వాక్రా మహిళా సంఘాలకు సుమారు 23 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వర్లుగా చేసే లక్ష్యంతో మహిళా సంఘాలను పెద్ద వ్యాపారాల్లోకి తీసుకురావడానికి పెట్రోలు బంకులు, బస్సులు, డైరీ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రత్యేక మహిళా బజార్లు వంటి పలు కార్యక్రమాల ద్వారా వారికి ఆదాయం పెరిగే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమని కొనియాడారు. విద్యా రంగంలో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఎంతో మంది మహిళలు ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో చేరి దేశానికి సేవలందిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రతి మహిళ ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న గౌడ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు బద్దుల వేణుగోపాల్ యాదవ్, దాచర్లపల్లి శ్రీపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసి శ్రీనివాస్, బబ్బూరి ఆనంద్ గౌడ్, బేర బాలకిషన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, నాయకులు కోటగిరి శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు వసంత, మహిళా పోలీసులు, జీహెచ్ఎంసీ మహిళా కార్మికులు, డాక్టర్ సుష్మిత తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :