Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ సీనియర్ అతిథి లెక్చరర్‌గా పనిచేస్తున్న కూనురాజుల సమ్మక్క పిహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి విశ్వవిద్యాలయంలో సమ్మక్క పార్ట్ టైం పిహెచ్డీ చేశారు. ఆ యూనివర్సిటీలో సూపర్వైజర్ డాక్టర్ శివకుమార్ వైష్ గైడ్‌షిప్‌లో “ఎ సోసియో పొలిటికల్ స్టడీ ఆఫ్ ట్రైబల్ ఉమెన్స్ రోల్ ఇన్ ది పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్” అనే అంశంపై పరిశోధన నిర్వహించారు. పరిశోధన పూర్తి కావడంతో యూనివర్సిటీలో ఓపెన్ వైవా నిర్వహించగా, సమ్మక్క వివరించిన పరిశోధన అంశాలు ఎగ్జామినర్లను సంతృప్తి పరచడంతో ఆమెకు పిహెచ్డీ డాక్టరేట్ ప్రకటించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మహమ్మద్ ఖాసిం బస్తికి చెందిన కూనురాజుల సమ్మక్క అకాడమిక్ విద్య పూర్తి చేసిన అనంతరం 2000 సంవత్సరం నుండి బెల్లంపల్లి క్లబ్ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యా వాలంటీర్ ఉపాధ్యాయురాలిగా చేరారు. అనంతరం బెల్లంపల్లి టేకుల బస్తి హై స్కూల్‌లో కంప్యూటర్ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. బెల్లంపల్లి బజార్ ఏరియా బ్రాంచ్ హై స్కూల్‌లో విద్యా వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు తరగతులు బోధించారు. 2022 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ అతిథి అధ్యాపకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2024 నుండి బెల్లంపల్లి ప్రభుత్వ పీజీ కళాశాలలో పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ విద్యార్థులకు తరగతులు బోధిస్తూ విధులు కొనసాగిస్తున్నారు. ఈ విధంగా పాతికేళ్లకు పైగా ఆమె విద్యారంగంతో అనుబంధం కలిగి ఉన్నారు. కూనురాజుల సమ్మక్క సబర్మతి విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ సీటు పొంది పరిశోధన పూర్తి చేసి ఉన్నత డిగ్రీని సాధించడం పట్ల యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, పొలిటికల్ సైన్స్ విభాగం డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఆమె తల్లిదండ్రులు కూనురాజుల వెంకటి, లక్ష్మి, పోసు, అన్నయ్య కూనురాజుల శ్రీనివాస్, వదినలు, అల్లుళ్లు, అక్కలు, భావలు, చెల్లెలు, కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి ప్రజలు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపాల్ మేడ తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, కళాశాల సూపరింటెండెంట్ పుప్పాల శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Admin
Studio18 News