Studio18 News - TELANGANA / MEDCHAL-MALKAJGIRI : అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. మేడ్చల్ జిల్లా నారపల్లిలో ఉన్న నల్ల మల్లారెడ్డి కళాశాలలో ఈ ఘటన జరిగింది. అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని కాలేజీ సిబ్బంది అవమానించారని భక్తుల ఆందోళన చేపట్టారు. మాల వేసుకుని కాలేజీకి వచ్చిన స్టూడెంట్తో యాజమాన్యం బలవంతంగా యూనిఫామ్ వేయించింది. దీంతో బీజేవైఎం ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం, లెక్చరర్ విద్యార్థి వేసుకున్న అయ్యప్ప మాల, దుస్తులను తీయించి కళాశాల యూనిఫామ్ వేయించి దుర్భాషలాడి, అవమానించారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మాల ధరిస్తారు.అలాంటి అయ్యప్పను అవమానించేటట్లు నల్ల మల్లారెడ్డి యాజమాన్యం చేయడం అంటే హిందువులను, అయ్యప్ప మాలను అవమానించడమే అన్నారు. కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడ్డ యాజమాన్యం ఆ అయ్యప్ప కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News