Studio18 News - TELANGANA / ADILABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రగతి పథంలో ప్రజా పాలనలో భాగంగా ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం తరఫున ఇందల్వాయి ఫైర్ స్టేషన్ అధికారులు నిహారిక చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిహారిక ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Studio18 News