Monday, 30 March 2026 02:55:03 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

ఎన్.జి.ఓస్ కాలనీ గ్రంథాలయ పనులకు శ్రీకారం—రేపటి నుండి ప్రారంభం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

Date : 24 March 2026 04:05 PM Views : 10

Studio18 News - TELANGANA / HYDERABAD : దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎన్.జి.ఓస్ కాలనీ గ్రంథాలయ పనులు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ఎన్.జి.ఓస్ కాలనీ పెద్దలు మరియు కాలనీవాసులు లైబ్రరీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు గ్రంథాలయ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గ్రంథాలయ పనులను తాను ఎప్పుడూ ఆపలేదని, కొందరు బీజేపీ కార్పొరేటర్ల చర్యల కారణంగా పనులు నిలిచిపోయాయని తెలిపారు. గ్రంథాలయ పనులను రేపటి నుండి ప్రారంభించాలని అక్కడే ఉన్న గ్రంథాలయ ఈఈ మరియు డీఈలకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి నుండి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని మరియు బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ భారస పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎన్.జి.ఓస్ కాలనీ పెద్దలు సోమయాజులు, పంపన్న వెంకటేశ్వర, శివనాగేశ్వర్ రావు, వేముల జైపాల్ రెడ్డి, వర్ధని, శశిధర్ రెడ్డి, ఓంప్రకేష్, భూషణ్, విశ్వనాథం, శ్యాంకుమార్, ఆనంద్, చుట్టుపక్కల కాలనీ పెద్దలు మరియు భారస నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అనిల్ చౌదరీ, యూత్ అధ్యక్షుడు మునగాల రాఘవేందర్ రావు, కొంగర మహేష్, నీళ్ల రాజశేఖర్ గౌడ్, నరేందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, అమర్థ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :