Studio18 News - TELANGANA / MANCHERIAL : మంచిర్యాల జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన బి. వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా కమలరాజ్, ప్రధాన కార్యదర్శిగా యు. వెంకటేష్, కోశాధికారిగా సందీప్ కుమార్, జాయింట్ సెక్రటరీగా డేనియల్, ఈసీ సభ్యులుగా ఎండీ అర్మన్, యు. అఖిల్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యవర్గ ఎన్నికలు నిర్వహించబడినట్లు తెలిపారు.
Admin
Studio18 News