Tuesday, 03 December 2024 05:22:57 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CPI Narayana: 'హైడ్రా' ప‌ని భేష్‌... రేవంత్ రెడ్డి వెన‌క్కి త‌గ్గొద్దు: సీపీఐ నారాయణ

Date : 26 August 2024 03:41 PM Views : 56

Studio18 News - తెలంగాణ / : సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయణ తాజాగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన హైడ్రా చేస్తున్న‌ ప‌ని భేష్ అని కొనియాడారు. "న‌గ‌రంలో చెరువులు, నాలాలు క‌బ్జా చేయ‌డం వ‌ల్ల వ‌ర్ష‌పు నీరు ఎక్క‌డికీ వెళ్లలేని ప‌రిస్థితి! అర‌గంట వ‌ర్షం ప‌డితే ఎక్క‌డికక్క‌డ వ‌ర్షపు నీరు నిలిచిపోయి న‌గ‌రం ముంపున‌కు గుర‌వుతోంది. ఆ స‌మ‌యంలో ప్ర‌జ‌ల అవ‌స్త‌లు వ‌ర్ణ‌నాతీతం. రాష్ట్ర ప్ర‌భుత్వం హైడ్రాను తీసుకొచ్చి మంచి ప‌ని చేసింది. అయితే, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ చేస్తున్నారు. ఆయ‌న ఎట్టిప‌రిస్థితుల్లో పులి మీద నుంచి దిగకూడదు. దిగితే మింగేసే ముప్పు పొంచి ఉంది. ప్ర‌భుత్వ భూముల‌ను కార్పొరేట్ శ‌క్తులు క‌బ్జా చేసి కార్యాల‌యాలు న‌డుపుతున్నాయి. ఈ అంశంపై చ‌ర్చించేందుకు రాష్ట్ర స‌ర్కార్ అఖిల‌ప‌క్ష స‌మావేశం నిర్వ‌హించాలి. ఇక హైడ్రా పేరుతో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఇళ్ల‌ను కూడా కూల్చివేస్తున్నారు. వారికి ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయం చూపించాలి" అని చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయకత్వంలోని కేంద్రంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపేయేత‌ర రాష్ట్రాల‌పై కేంద్రం స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. అదానీకి సెబీ స‌లాం కొడుతుంద‌ని, ఈ వ్య‌వ‌హారంపై జేపీసీ వేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :