Saturday, 14 December 2024 02:44:03 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

అసెంబ్లీలో దానం నాగేందర్ విశ్వరూపం వెనుక పెద్ద స్కెచ్..!

Date : 06 August 2024 10:06 AM Views : 91

Studio18 News - తెలంగాణ / : Gossip Garage : ఆ నేత ఇప్పుడు టాక్ ఆఫ్ తెలంగాణ… అసెంబ్లీ సాక్షిగా అచ్చమైన హైదరాబాదీ భాషలో రెచ్చిపోయిన ఆ నేత ఇటు కాంగ్రెస్… అటు బీఆర్ఎస్‌లో ఆసక్తికర చర్చకు తెరలేపారు. సీనియర్ ఎమ్మెల్యేనే అయినప్పటికీ ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే ఆ నేత… అసెంబ్లీ సాక్షిగా సహచర ఎమ్మెల్యేలపై రెచ్చిపోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌… ఇంతకీ ఆ నేత అంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి… విపక్ష ఎమ్మెల్యేలు రెచ్చగొడితే సంయమనం కోల్పోయారా? లేక సమయం కోసం వేచి చూసి తన ప్రస్టేషన్ అంతా తీర్చేసుకున్నారా? నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా… మంత్రిగా… సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పని చేసిన ఆ నేత విశ్వరూపం వెనుక పెద్ద స్కెచ్చే ఉందనే టాక్ వినిపిస్తోంది… అసెంబ్లీలో దానం నాగేందర్ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారశైలి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్‌గా మారింది. గత వారం జరిగిన అసెంబ్లీలో హైదరాబాదీ స్టైల్ అంటూ విపక్షంపై రెచ్చిపోయిన దానం… ఎందుకలా మట్లాడాల్సి వచ్చిందంటూ అంతా ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ నేతలు సైతం దానం తీరుపై విస్తృతంగా చర్చిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం…. తన పాత పార్టీపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్‌, ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకే దానం అలా మాట్లాడారా? దానం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించినా… సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే దానం తీవ్రస్థాయిలో మాటల దాడి చేయడం వెనుక ముందుస్తు వ్యూహం ఉన్నదని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దానం.. హైదరాబాద్ నుంచి మంత్రిగా చాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండటం, కాంగ్రెస్ నుంచి గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులిస్తామని హైకమాండ్ చెబుతుండటంతో… సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకే దానం అలా మాట్లాడారా? అనే చర్చ జరుగుతోంది. తన లాంటి వారి అండ ఉంటేనే గ్రేటర్ లో కారు జోరును కట్టడి చేయవచ్చనే సంకేతాలిచ్చేందుకే ఇంతలా రెచ్చిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి…. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన తాను రిస్క్ చేశానని…. అందువల్ల మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్‌పై ఒత్తిడి చేయడమూ దానం మాటల్లో దాగున్న అసలు రహస్యమని అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై బూతులతో విరుచుకుపడ్డారా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు చేరినా… అందరిలో కన్నా దానం ఒక్కడిపైనే వేటు కత్తి ఎక్కువగా వేలాడుతుందంటున్నారు. దానికి ప్రధాన కారణం… బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే… కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడమేనని టాక్‌. మిగిలిన ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా ఎక్కడా దొరక్కుండా తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ… దానం మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఆధారాలతో సహా దొరికిపోయినట్లేనంటున్నారు. అందుకే బీఆర్ఎస్ కూడా దానంపై వేటు కోసం ఇటు అసెంబ్లీలో పోరాడుతూనే… అటు న్యాయ పోరాటం ఉధృతం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో బలంగా ఉన్నామని భావిస్తున్న బీఆర్ఎస్… ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక తెచ్చి సత్తా చాటాలని చూస్తోందంటున్నారు. దీంతో బీఆర్ఎస్ తనను మాత్రమే టార్గెట్ చేస్తోందనే ప్రస్టేషన్‌తోనే ఎమ్మెల్యే దానం…. బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ రికార్డుల నుండి తొలిగించే స్థాయిలో బూతులతో విరుచుకుపడ్డారని అంటున్నారు. ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్‌కు మెసేజ్ పంపాలనేదే దానం వ్యూహమా? ఒకే దెబ్బకు రెండు పిట్టలు… అన్నట్లు అసెంబ్లీలో తన వ్యాఖ్యల ద్వారా ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్‌కు మెసేజ్ పంపాలనేదే దానం వ్యూహమా? అనే చర్చ జరుగుతోంది. పార్టీ మారడం, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ టార్గెట్‌గా మారిన దానం… ఆ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో… తనతో పెట్టుకుంటే హైదరాబాద్‌లో తిరగలేరన్నట్లు వ్యాఖ్యానించారంటున్నారు. అదే విధంగా కాంగ్రెస్ కూడా తనకు మంత్రి పదవి ఇస్తే… నగరంలో తన మార్కు చూపెట్టి పార్టీని బలోపేతం చేస్తానని చెప్పినట్లైందంటున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకున్న బీఆర్ఎస్‌పై…ముఖ్యంగా రేవంత్ కు కంట్లో నలుసుగా మారిన కౌశిక్ రెడ్డిపై మాటల దాడి చేయడం ద్వారా సీఎం ఆశీస్సులు పొందొచ్చనని దానం భావించి ఉంటారనే గుసగుసలు కాంగ్రెస్ వర్గాల్లోనే విన్పిస్తున్నాయి. దానం అంతరంగాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకుంటుందా? మొత్తానికి మంత్రి పదవితోపాటు అనర్హత పిటిషన్‌పై ముందుకు వెళ్లకుండా బీఆర్ఎస్‌ను కాస్త కంట్రోల్ చేయడమే దానం ప్లాన్‌గా కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ స్థాయిలో స్పీడ్ చూపిస్తే గాని… తన లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించకపోవడంతోనే అసెంబ్లీ అన్నది కూడా మరచిపోయి దూకుడు చూపించారంటున్నారు. ఈ పరిస్థితుల్లో దానం అంతరంగాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకుంటుందా? బీఆర్ఎస్ తన దాడిని మరింత పెంచుతుందా ? అనేది చూడాల్సివుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :