Studio18 News - TELANGANA / RANGAREDDY : రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండలం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి ప్రజలనుండి దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రేషన్ కార్డులకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులను ఇవ్వాలని, పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెల్లడించారు.
Also Read : ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణలు చెప్పాలి - బిఎస్పీ డిమాండ్
Admin
Studio18 News