Studio18 News - TELANGANA / HYDERABAD : కొండాపూర్, జనవరి 12 : చందానగర్ పోలీస్ స్టేషన్‌ని(,Chandanagar Police Station) శేరిలింగంపల్లి డీసీపీ సీహెచ్ శ్రీనివాస్(DCP Srinivas) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం స్టేషన్ లో రికార్డులను పరిశీలించి, కేసుల నమోదు, కన్విక్షన్ పై అరా తీశారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. పీఎస్ పరిధిలో పెట్రోలింగ్ గస్తీ పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. చైనా మాంజాల అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Admin
Studio18 News