Friday, 14 February 2025 08:12:03 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

KTR: పదిహేను పక్కన ఇన్ని సున్నాలా... రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

Date : 21 July 2024 03:24 PM Views : 74

Studio18 News - TELANGANA / : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మూసీ నదిని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న రూ.50 వేల కోట్లు అవుతుందని అన్నారు... నిన్న రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు... నేడు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని వివరించారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు అయితేనే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టిందని విమర్శించారు. మరి, సుందరీకరణకే రూ.1.50 లక్షల కోట్లా...! పదిహేను పక్కన ఇన్ని సున్నాలా... 15,000,000,000,000... అంటూ కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని? సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు ఎన్ని? అని కేటీఆర్ ప్రశ్నించారు. పుట్టినగడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంటే కూడా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకింత మక్కువ? అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టును పక్కనబెట్టి... మూసీ చుట్టూ ఎందుకింత మంత్రాంగం...? అంటూ సందేహం వ్యక్తం చేశారు. లండన్ లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏంటి? గేమ్ ప్లాన్ ఏంటి? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారూ... మూడింతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధన దాహానికి సజీవ సాక్ష్యం... మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే... కానీ... మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే మాత్రం సహించేది లేదు అంటూ కేటీఆర్ హెచ్చరించారు. తట్టెడు మట్టి కూడా తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరదీస్తే భరించబోమని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్ లో జరుగుతున్న భాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది... కుంభకోణాల కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాతపెడుతుంది అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :