Saturday, 14 December 2024 07:38:55 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Mahesh Kumar Goud: జీవన్ రెడ్డి విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

Date : 23 October 2024 04:46 PM Views : 28

Studio18 News - తెలంగాణ / : ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమని, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని సొంత పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫిరాయింపులపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమంటూ కీలక వ్యాఖ్య చేశారు. పార్టీలో చేరికల గురించి మాట్లాడుతూ... అందరితో చర్చించాకే ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు తెలిపారు. తమకు ప్రతి ఒక్కరూ అవసరమేనని... ఏ కార్యకర్తనూ వదులుకోమన్నారు. ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను చేర్చుకోవాలన్నది అధిష్ఠానం నిర్ణయమే అన్నారు. పెద్దల సూచన ప్రకారమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నట్లు తెలిపారు. జీవన్ రెడ్డి ప్రతిష్ఠకు ఎక్కడా భంగం వాటిల్లదని హామీ ఇచ్చారు. ఆయన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ హత్య కేసుపై విచారణ సాగుతోందని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను జీవన్ రెడ్డితో మాట్లాడానని గుర్తు చేశారు. ఆయన ఆవేదనలో ఉన్నారని, అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు పాతవారిని కలుపుకు పోవాలని సూచించారు. జగిత్యాల మాత్రమే కాదని, ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త, పాత నాయకుల సమస్య ఉందన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :