Studio18 News - తెలంగాణ / : మెగాస్టార్ చిరంజీవికి కేంద్రమంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్‌తో పాటు మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "లెజెండరీ మెగాస్టార్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సినిమాకు మీ అసమానమైన సహకారం, మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాదిమందికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. స్క్రీన్ పైన, బయట మీ వెలుగు కొన్ని తరాలు ఉండిపోతుంది" అని బండి సంజయ్ పేర్కొన్నారు. పెద్ద పెద్ద కలలు కనేలా, సినిమా పరిశ్రమకు వచ్చేలా ఒక తరం యువతకు మీరు స్ఫూర్తినిచ్చారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి, సినీ పరిశ్రమకు మీ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయువుతో జీవించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కేటీఆర్ కూడా చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
Admin
Studio18 News