Sunday, 08 March 2026 03:34:43 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Rani Kumudini: తెలంగాణకు కొత్త‌ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌

Date : 17 September 2024 04:04 PM Views : 479

Studio18 News - TELANGANA / : తెలంగాణ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా రిటైర్ ఐఏఎస్ ఆఫీస‌ర్‌ రాణి కుముదిని నియ‌మితుల‌య్యారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ పార్థ‌సార‌ధి ప‌ద‌వీకాలం ఈ నెల 8న ముగిసింది. దాంతో ఆయ‌న స్థానంలో రాణి కుముదినిని ప్ర‌భుత్వం నియ‌మించింది. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్లు ఆమె ఈ ప‌ద‌విలో కొన‌సాగుతార‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. కాగా, 1988 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కుమిదిని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో వివిధ హోదాల్లో ప‌నిచేశారు. కేంద్ర స‌ర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక‌శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. తాజాగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నియామ‌కం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :