Friday, 14 February 2025 08:03:32 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Mallu Bhatti Vikramarka: రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుడు... కేటీఆర్ అలా మాట్లాడకూడదు: భట్టివిక్రమార్క

Date : 24 July 2024 05:16 PM Views : 122

Studio18 News - TELANGANA / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నాయకుడని... ఆయనకూ సభా వ్యవహారాలు తెలుసునని, సభా నాయకుడిని పట్టుకుని అనుభవం లేదని కేటీఆర్ అనడం సరికాదని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క హితవు పలికారు. బీజేపీకి కోపం వస్తుందనే కేటీఆర్ అసలు విషయాన్ని వదిలేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ... బీఆర్ఎస్‌కు పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని నిలదీశారు. కేంద్ర బడ్జెట్‌లో మూసీకి, మెట్రోకు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. తాము అడుగుతున్నవి హక్కుగా తమకు రావాల్సినవే అన్నారు. తాము బీజేపీతో జతకట్టామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఏడు మండలాల గురించి అసలు మీరేం చేశారని ప్రశ్నంచారు. ఏడు మండలాల విషయం లేకుండానే ఏపీ పునర్విభజన బిల్లు పాస్ అయిందని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత ఏపీలో కలిపారన్నారు. వివిధ అంశాలపై ఢిల్లీలో యుద్ధం అన్నారని... మరి చేశారా? అని ప్రశ్నించారు. కనీసం మాటైనా అడిగారా? అన్నది చెప్పాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంకు కనీసం నీళ్ళు కూడా ఇవ్వని వారు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రభుత్వంతో కలిసి రావాలని కోరారు. అప్పుడు కేంద్రం నుంచి నిధులు ఎందుకు రావో చూద్దామన్నారు. మూసీ ప్రాజెక్టుపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు కోసం డీపీఆర్ ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ను బీజేపీ, బీఆర్ఎస్ గాలికి వదిలేశాయన్నారు. బీజేపీకి హరీశ్ రావు చిట్టీలు అందిస్తున్నారు హరీశ్ రావు బీజేపీ సభ్యులకు చిట్టీలు అందిస్తున్నారని మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ హరీశ్ రావు... బీజేపీ హరీశ్ బాబు ద్వారా బీజేపీ ఫ్లోర్ లీడర్‌కు నకలు చిట్టీలు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :