Sunday, 08 March 2026 10:32:03 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

బీఆర్ఎస్ తో పొత్తు మాకేం అవసరం?.. బీజేపీ నేత రఘునందన్ రావు

Date : 30 May 2025 01:07 PM Views : 485

Studio18 News - TELANGANA / : బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే ప్రయత్నం జరిగిందని, ఇందుకోసం చర్చలు జరిపారని ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాజాగా స్పందించారు. బీఆర్ఎస్ కుటుంబ కలహాలలోకి కవిత బీజేపీని లాగుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ లో ప్రస్తుతం కవిత చెల్లని రూపాయిగా మారారని విమర్శించారు. ఆ పార్టీలో, కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత గొడవలలోకి కవిత బీజేపీని లాగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఆ దిశగా ఎలాంటి చర్చలు జరపలేదని రఘునందన్ రావు తేల్చిచెప్పారు. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్ లో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననం జరుగుతోందని కవిత ఆరోపించిందని గుర్తుచేశారు. ఈ ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. కవిత వ్యక్తిత్వహననానికి పాల్పడుతుంది ఎవరనేది తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ ను మెయింటెయిన్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. దాదాపు 20 యూట్యూబ్ ఛానల్స్ కు కేటీఆర్ జీతాలు ఇస్తున్నారని, తన పత్రికలోనూ తప్పుడు కథనాలను ప్రచురించేలా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బీజేపీ మినహా దాదాపు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని రఘునందన్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ తో అంటకాగుతూ 2014 లో ఆ పార్టీని విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని గుర్తుచేశారు. కుటుంబం మొత్తం ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ కాళ్లపై పడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ ప్రజలకు రూపాయి ప్రయోజనం కూడా లేకుండా పోయిందని చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు సైతం రూపాయి కూడా దక్కలేదని రఘునందన్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబ ఆస్తులు మాత్రమే పెరిగాయని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇలాంటి కుటుంబ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో బీజేపీ సొంతంగానే ఎదుగుతోందని రఘునందన్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ బీజేపీ ప్రజలకు చేరువ అవుతోందని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :