Monday, 08 December 2025 02:55:29 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Kalvakuntla Kavitha: ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక: కాళోజీని కొనియాడిన కవిత

Date : 13 November 2025 07:17 PM Views : 133

Studio18 News - TELANGANA / HYDERABAD : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు వర్ధంతి నేడు ఆయనకు నివాళులర్పించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అణచివేతను ఎదిరించిన గొప్ప తత్వం ఆయనదని ప్రశంస ప్రజాకవి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు ఘన నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణ గడ్డ గర్వించదగ్గ కలం యోధుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి, పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ" అని కవిత తన పోస్టులో పేర్కొన్నారు. అణచివేత, అన్యాయం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దానిని ధైర్యంగా ఎదిరించిన తత్వం ఆయనదని ప్రశంసించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ విముక్తి కోసం కాళోజీ చేసిన పోరాటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. సామాన్య ప్రజల భాష, యాసలోనే వారి సమస్యలపై గళం విప్పి, తెలంగాణ విముక్తి కోసం నిరంతరం తపించిన మహనీయుడు కాళోజీ అని కవిత స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కాళోజీ అందించిన స్ఫూర్తిని పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :