Studio18 News - TELANGANA / : తెలంగాణ హైకోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జల్‌పల్లిలోని తన ఇంటి వద్ద విలేకరులపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మోహన్ బాబును ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. విచారించిన హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నట్లు ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
Also Read : అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
Admin
Studio18 News