Saturday, 14 December 2024 06:18:32 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Padi Kaushik Reddy: ప్రభుత్వం నా ఫోన్‌ను ట్యాప్ చేస్తోంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Date : 05 September 2024 05:19 PM Views : 46

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రుణమాఫీ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణలో కేవలం 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. అదీ ఏకకాలంలో జరగలేదన్నారు. తన నియోజకవర్గంలో ఓడిపోయిన వారు చెక్కులు పంచుతుండటం విడ్డూరమన్నారు. పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు ఎందుకు స్పందించడం లేదని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధికారుల కోసం తాను ఓ 'బ్లాక్ బుక్‌'ను రెడీ చేశానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా, పెన్షన్ పెంపుపై తాము ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురు దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో ప్రోటోకాల్స్ ఎందుకు పాటించడం లేదని నిలదీశారు. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కులు పంచకపోతే హైకోర్టుకు వెళతానని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :