Sunday, 08 February 2026 11:44:39 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్

ఎంపీ ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీ పరిశీలన

Date : 17 March 2025 04:23 PM Views : 440

Studio18 News - TELANGANA / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు. డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన ఘటనపై మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎంపీ ఇంటికి చేరుకొని వివరాలను సేకరించారు. దుండగుడు ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. డీకే అరుణకు కల్పించాల్సిన భద్రత పైనా డీసీపీ వివరాలు సేకరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని ఎంపీ నివాసంలో ముసుగు ధరించిన ఆగంతుకుడు ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, దాదాపు గంట పాటు ఇంట్లో తిరిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డీకే అరుణ కూతురు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :