Studio18 News - TELANGANA / : BRS MLAs: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఓ ఫ్యూడలిస్ట్‌లా ఉందంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన వ్యవహరిస్తున్నది తాలిబన్లను తలపిస్తోందని చెప్పారు. గతంలో డీకే అరుణ గురించి అలాగే మాట్లాడారని అన్నారు. సీనియర్ మహిళా నేతల పట్ల సీఎం చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరమని చెప్పారు. సీఎం చేసిన వ్యాఖలపై చెప్పుకునే అవకాశం సభలో సబితకు ఇవ్వలేదని అన్నారు. తాము నిరసన వ్యక్తం చేసినా పట్టించుకోలేదని తెలిపారు. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినప్పటికీ తమ పార్టీ మహిళా భ్యులకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దాదాపు 4.30 గంటల పాటు తాము నిరసన తెలిపినా స్పందించలేదని తెలిపారు. తాము ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. నాపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారు: జగదీశ్ రెడ్డి తమ పార్టీ మహిళ ఎమ్మెల్యేలు నిన్న ఒక్క మాట కడా మాట్లాడలేదని జగదీశ్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ దారికాచి దోపిడీ చేసినట్లు ఒక్కసారిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేశారని చెప్పారు. రాష్ట్రంలోని జరుగుతున్న ఘటనలపై సబితా అసెంబ్లీలో మాట్లాడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేదని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులే దోషులుగా ఉంటున్నట్లు సమాచారం వస్తుందని చెప్పారు. కేసీఆర్‌ను విమర్శించేందుకే రేవంత్ సభను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. తనపై తాగుబోతు మంత్రిని రెచ్చగొట్టారని చెప్పారు. సభకు ఆ మంత్రి తాగే వస్తారని ఆరోపించారు.
Admin
Studio18 News