Sunday, 08 February 2026 11:41:52 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Revanth Reddy: ఏటీసీ ట్రైనింగ్ తో జర్మనీలో నెలకు రూ. 3.50 లక్షల వేతనం తీసుకునే వారు ఉన్నారు: రేవంత్ రెడ్డి

Date : 27 September 2025 07:05 PM Views : 229

Studio18 News - TELANGANA / HYDERABAD : సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవద్దని వ్యాఖ్య విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు అవసరమన్న ముఖ్యమంత్రి అవసరమైన స్కిల్స్ యువతలో లేవని పరిశ్రమలు చెబుతున్నాయని వ్యాఖ్య కేవలం సాఫ్ట్‌వేర్ కోర్సులతోనే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని భావించరాదని, ఏటీసీలో శిక్షణ పొంది జర్మనీలో నెలకు రూ. 3.50 లక్షల వేతనం పొందుతున్న వారు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీసీ ప్రాంగణంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించడం కోసం టాటా టెక్నాలజీస్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. వారి సహకారంతోనే ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. ఆటోమొబైల్ రంగంలో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, కానీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు యువతలో కొరవడ్డాయని ఆయన పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు లభించడం లేదని పలు కంపెనీలు చెబుతున్నాయని అన్నారు. రూ. 2,400 కోట్ల వ్యయంతో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని, ఒక్కో కేంద్రంలో సుమారు 200 మంది ప్రవేశాలు పొందుతున్నారని తెలిపారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న వారందరికీ ఉద్యోగాలు లభిస్తున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాల్లో శిక్షణ పొందే విద్యార్థులకు ప్రతి నెల రూ. 2 వేల స్టైఫండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. నిరుద్యోగుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, రాష్ట్రం ఏర్పడిన తరువాత పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, సాంకేతిక నైపుణ్యం మాత్రమే మన భవిష్యత్తును మారుస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజుల్లో సాంకేతిక నైపుణ్యం తప్పనిసరి అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గంజాయి కేసుల్లో అధికంగా ఇంజినీరింగ్ విద్యార్థులే పట్టుబడటం దురదృష్టకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. గంజాయికి బానిసలై విద్యార్థుల తల్లిదండ్రులకు బాధ కలిగించవద్దని హితవు పలికారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :