Studio18 News - TELANGANA / : Heavy Rain in Hyderabad : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇవాళ తెల్లవారు జాము 4గంటల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవడంతో నగరంలోని రహదారులు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్ నగర్, కుత్బుల్లాపూర్, బాలా నగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట ప్రాంతాలతోపాటు వనస్థలిపురం, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట, అబ్దుల్లాపూర్ మెంట్ ప్రాంతాల్లో కుండపోత వర్షంకురిసింది. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులు జలమయంగా మారాయి. సోమవారం రాత్రి నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా.. మంగళవారం తెల్లవారు జామున కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలిలోతు వరకు నీరుచేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మరికొన్ని గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షంకురిసే అవకాశం ఉందని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని రహదారులపైకి వర్షపునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మలక్ పేటలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకిదిగాయి.
Admin
Studio18 News