Monday, 17 February 2025 03:35:42 PM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Ponguleti Srinivas Reddy: నా ఇల్లు అక్రమమైతే కూల్చేయండి... హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నా!: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 23 August 2024 05:06 PM Views : 81

Studio18 News - TELANGANA / : హిమయత్ సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో తనకు ఫామ్ హౌస్ ఉందని బీఆర్ఎస్ మీడియా బురద జల్లుతోందని, తన ఇల్లు అక్రమంగా ఉంటే... వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్‌ను ఆదేశిస్తున్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారులకు బదులు బీఆర్ఎస్ వాళ్లే వెళ్లి కొలవాలని, అక్రమమని తేలితే కూల్చేసుకోండని కేటీఆర్, హరీశ్ రావులకు సవాల్ విసిరారు. హైడ్రాను తాము ఓ మంచి ఉద్దేశంతో తెచ్చామన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను అనుమతించేది లేదన్నారు. అలాంటి కట్టడాలను కూల్చివేస్తున్నామన్నారు. అవన్నీ గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్మాణాలేనని విమర్శించారు. ఆయన శుక్రవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేశాం! ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, అయినప్పటికీ తాము హామీలు నెరవేర్చామన్నారు. ధనిక రాష్ట్రమని చెప్పి కేసీఆర్ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తాము ఇతర ఖర్చులను తగ్గించుకొని రుణమాఫీ చేశామన్నారు. 22 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేశామన్నారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 వేల కోట్లు జమ అయ్యాయని, మిగిలిన రైతుల ఖాతాల్లోను మరో రూ.12 వేల కోట్లు త్వరలో వేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలా తాము మోసం చేయడం లేదన్నారు. రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వం రైతులను రెండుసార్లు మోసం చేసిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా కొందరికే రుణమాఫీ చేశారన్నారు. ప్రచారం కోసం గత ప్రభుత్వంలా వేల కోట్ల రూపాయలను వృథా చేయడం లేదన్నారు. ఉచిత విద్యుత్ కోసం 42 లక్షల దరఖాస్తులు మాత్రమే సక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తప్పులను సవరించి మరో 7 లక్షల మందికి పైగా ఉచిత విద్యుత్ వర్తింప చేస్తున్నామన్నారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ రాయితీ లబ్ధిదారుల సంఖ్య నిత్యం పెరుగుతోందన్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే సవరణలు చేస్తున్నట్లు చెప్పారు. 18 రాష్ట్రాల రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్‌ను తీసుకువస్తున్నామన్నారు. ఇది దేశానికే రోల్ మోడల్ అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :