Studio18 News - తెలంగాణ / : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంతికుమారి, కోదండరెడ్డి, కే కేశవరావు పాల్గొన్నారు. ధరణిలో సమస్యలు, మార్పులు - చేర్పులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ధరణి సమస్యల పరిష్కారానికి లోతుగా అధ్యయనం చేయాలన్నారు. శాశ్వత పరిష్కారం చేపట్టాలని సూచించారు. సవరణల వల్ల కొత్త సమస్యలు రాకుండా చూడాలన్నారు. మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వారి అభిప్రాయాల మేరకు సమగ్ర చట్టం తేవాలన్నారు. అవసరమైతే అసెంబ్లీలో ధరణిపై చర్చ చేపడదామన్నారు. జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్‌పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం సమీక్ష నిర్వహించారు. విధివిధానాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 33 జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అధికారులను భట్టివిక్రమార్క ఆదేశించారు.
Admin
Studio18 News