Tuesday, 03 December 2024 05:20:52 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Hydraa: హైడ్రా భయంతో కుంట అలుగు తెంపిన స్థానికులు

Date : 24 September 2024 12:41 PM Views : 31

Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ కూల్చివేతల భయంతో మంచిరేవులలో కొంతమంది స్థానికులు వర్షాలకు నీటితో నిండిన కుంట అలుగును తెంపేశారు. కుంట పూర్తిగా నిండడం, మళ్లీ వర్షం పడితే వరద తమ ఇళ్లల్లోకి వస్తుందనే ఆలోచనతో ఈ పని చేశారు. వరద నీరు వచ్చి చేరితే హైడ్రా దృష్టి ఎక్కడ తమ ఇళ్లపై పడుతుందోననే భయంతో పొక్లెయిన్ తెప్పించి మరీ అలుగు తెంపారు. అసలేం జరిగిందంటే.. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిరేవుల వీరభద్రస్వామి గుట్టకు వెళ్లేదారిలో ఎకరం 29 గుంటల విస్తీర్ణంలో ఉన్న మల్లన్న కుంట నిండింది. దీంతో తమ ఇళ్ల వద్దకు నీరు చేరే అవకాశం ఉందని, వరద ముంచెత్తితే హైడ్రా ఎక్కడ తమ ఇళ్లపైకి వస్తుందోనని కొంతమంది స్థానికులు ఆందోళన చెందారు. ఆ ప్రమాదం లేకుండా సోమవారం పొక్లెయిన్‌ తీసుకువచ్చి అలుగును కొంత తొలగించి నీటిని బయటికి వదిలారు. ఈ చర్యలను మరికొంతమంది అడ్డుకుని అధికారులకు సమాచారం అందించారు. దీనిపై తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి స్పందించి వీఆర్ఏలను అక్కడికి పంపించారు. వీఆర్‌ఏలు బి.మల్లేష్, అచ్యుత్‌లు అలుగును పరిశీలించి స్థానికులను విచారించారు. అనంతరం విషయాన్ని నీటిపారుదల శాఖ అధికారులకు తెలియజేశారు. కుంట అలుగు ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :