Studio18 News - TELANGANA / : సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలం 20 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హైడ్రా రంగంలోకి దిగింది. ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, నిర్మించిన కట్టడాలను కూల్చేస్తూ, సరిహద్దు రాళ్లను రెవెన్యూ సిబ్బంది తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన అధికారులు.. సర్వే నంబర్ 119లో గుర్తుతెలియని వ్యక్తులు వేసిన ప్లాట్లను తొలగించారు. ఈ భూమిలో ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం 15 గుంటలు ఆక్రమించినట్లు గుర్తించారు. స్కూల్ ప్రహరీతో పాటు ఆక్రమించిన భూమిలో నిర్మించిన పలు గదులను కూలగొట్టారు.
Admin
Studio18 News