Saturday, 14 December 2024 06:58:39 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

CM Revanth Reddy : అమెరికాలో డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ దక్షిణ కొరియాలో పర్యటన

Date : 12 August 2024 11:56 AM Views : 41

Studio18 News - తెలంగాణ / : CM Revanth Reddy South Korea Tour : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన కొనసాగుతుంది. యూఎస్ లో పర్యటన ముగించుకొని తాజాగా రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాలోకి అడుగుపెట్టింది. ఆ దేశంలోని సియోన్ నగరానికి చేరుకుంది. దక్షిణ కొరియాలో పెట్టుబడల వేట కొనసాగనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ యూయూ ఫార్మా ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. నెక్ట్స్, హ్యూందయ్ మోటార్ కంపెనీల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. హ్యాన్ రివర్ ప్రాజెక్ట్ డిప్యూటీ మేయర్ తోనూ, సాంసంగ్ అధ్యక్షుడు కిమ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈవోతోనూ రేవంత్ బృందం భేటీ కానుంది. రేపు సాయంత్రం దక్షిణ కొరియా నుంచి సింగపూర్ వెళ్లనుంది. ఎల్లుండి హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. అమెరికా పర్యటనలో ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది. గూగుల్ కంపెనీకి చెందిన వేమో డ్రైవర్ లెైస్ కారులో రేవంత్ రెడ్డి ప్రయాణించారు. డ్రైవర్ లేకుండానే ఆ కారు నడుస్తుండటాన్ని ఆయన నిశితంగా పరిశీలించారు. వేమో కారులో సీఎం రేవంత్ రెడ్డితోపాటు, మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రయాణించారు. దానిలో జర్నీ ఎలా ఉందనే విషయాన్ని ప్రత్యక్ష్యంగా తెలుసుకున్నారు. యూఎస్ లో ఎనిమిది రోజులు పాటు పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం దాదాపు 50 వాణిజ్య సంస్థలతో సంప్రదింపులు జరిపారు. న్యూయార్క్, న్యూజెర్సీ కాలిఫోర్నియా, డల్లాస్, టెక్సాస్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణ బ్రాండ్ ను వివరిస్తూ తమ ప్రభుత్వ ఫ్యూచర్ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. అమెరికాలో దాదాపు 31,531కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది. గూగుల్, అమెజాన్ సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో సుమారు 30,750 కొత్త ఉద్యోగాలు అందుబాటులో రానున్నాయి.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :