Studio18 News - తెలంగాణ / : తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం పిలుపు మేరకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు అందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కూడా తమ ఒకరోజు జీతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు. దీని తాలూకు రూ. 11,06,83,571 చెక్కును పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి చేతికి అందజేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి డీజీపీ జితేందర్ తెలంగాణ పోలీసుల తరఫున చెక్‌ను అందించడం జరిగింది.
Admin
Studio18 News