Saturday, 07 March 2026 08:55:06 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

Nalgonda District: నల్లగొండలో అమాన‌వీయ ఘ‌ట‌న‌.. కుర్చీలోనే ప్రసవించిన మహిళ!

Date : 23 August 2024 03:12 PM Views : 380

Studio18 News - TELANGANA / : నల్లగొండ జిల్లాలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు లేక‌పోవ‌డంతో నల్గొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫ‌ర్ చేశారు. దాంతో దేవరకొండ నుంచి అశ్వినిని ఆమె కుటుంబ స‌భ్యులు అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఆసుప‌త్రి సిబ్బంది వారిని ఇక్కడికి ఎందుకు వ‌చ్చారంటూ దుర్భాష‌లాడారు. మూడో కాన్పు అంటున్నారు క‌నుక‌ దేవరకొండలోనే చేయించక ఇక్కడి దాక రావడం అవ‌స‌ర‌మా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అక్క‌డ డాక్ట‌ర్లు లేర‌ని, అందుకే ఇక్క‌డికి తీసుకొచ్చామ‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు. ఇక‌ అశ్వినిని నర్సులు బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు. పాపం.. నొప్పులు వస్తున్నాయ‌ని చెప్పిన అక్క‌డి సిబ్బంది ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీవ్ర నొప్పులతో అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. దాంతో కుర్చీ కింద తీవ్ర రక్త స్రావమైంది. అప్పుడు న‌ర్సులు హడావుడిగా వచ్చి ఆమెపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలా త‌న భార్య ప‌ట్ల‌ నిర్లక్ష్యం వ‌హించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త ఆంజనేయులు కోరారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వెంట‌నే ఆసుప‌త్రికి వచ్చారు. అస‌లేం జ‌రిగిందో అక్క‌డి సిబ్బందిని, బాధితుల‌ను అడిగి వివరాలు తీసుకున్నారు. బాధ్యులపై త‌ప్ప‌కుండా చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :