Sunday, 08 March 2026 04:22:37 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Ice Cream: హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా

Date : 06 September 2024 12:04 PM Views : 608

Studio18 News - TELANGANA / : హైద‌రాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వ‌చ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్ల‌ర్‌పై జ‌రిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ క‌లిపి అమ్ముతున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 ఎంఎల్ విస్కీ క‌లిపి విక్ర‌యిస్తున్న‌ట్లు అధికారులు క‌నుగొన్నారు. ఈ ఐస్‌క్రీమ్‌ల‌ను పిల్ల‌లు, యువ‌త భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్న‌ట్లు పోలీసుల‌కు తెలిసింది. దీంతో త‌నిఖీలు నిర్వ‌హించి ఐస్‌క్రీమ్ పార్ల‌ర్ య‌జ‌మానులు ద‌యాక‌ర్ రెడ్డి, శోభ‌న్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న‌గ‌రంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్ల‌ర్లు ఉన్నాయి, ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన విక్ర‌యాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో త‌ర‌చూ అక్క‌డ ఐస్‌క్రీమ్ కొనుగోలు చేసిన‌ పిల్ల‌ల పేరెంట్స్ ఆందో‌ళ‌న చెందుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :