Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి షాక్ ఇచ్చారు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఉపేందర్ రెడ్డి తప్పుపట్టారు. ఈ టెండర్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పారు. సృజన్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... సృజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కాదని, తన సొంత అల్లుడని చెప్పారు. అమృత్ టెండర్లపై కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని... ఆయన అవగాహన లేకుండా మాట్లాడారని తెలిపారు. తన వ్యాపారాలకు రాజకీయాన్ని ఎప్పుడూ వాడుకోలేదని చెప్పారు. తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని అన్నారు.
Admin
Studio18 News