Studio18 News - TELANGANA / : నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం సిరసవాడ ప్రభుత్వ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అపార్థరాజకీయాలను ప్రక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. "Mjr చారిటబుల్ ట్రస్ట్" - "మర్రి రిటైల్ కంపెనీ" ఆధ్వర్యంలో నిర్మించిన పాఠశాలలపై ట్రస్ట్ , కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణమన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కోన్నారు. ఇదే విషయంపై అధికారులను నిలదీయడంతో వారు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయా పాఠశాలలపై పేర్లతో తొలగించడం జరిగిందని చెప్పారని వాపోయారు. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కానీ ట్రస్ట్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై పేరు తొలగించాలని అధికారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఈ రోజు కేవలం గోడల పైన ట్రస్ట్ పేర్లు మాత్రమే తొలగించగలరు కానీ.. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన "మర్రి" పేరును మాత్రం తొలగించలేరని పేర్కోన్నారు. ఇకనైనా దుర్మార్గపు పనులు మానుకొని ప్రజలకు మంచి చేస్తూ.. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేసారు.
Also Read : nagarkurnool : భాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి
Admin
Studio18 News