Sunday, 08 March 2026 04:32:41 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

Kunamneni: పార్టీ ఫిరాయించే వాళ్ల సభ్యత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలి: కూనంనేని

Date : 10 September 2024 01:12 PM Views : 424

Studio18 News - TELANGANA / : పార్టీ ఫిరాయింపుదారులను ఉద్దేశించి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలుపొంది, మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల అభ్యర్థిత్వాలను ఆటోమేటిక్ గా రద్దు చేయాలని ఆయన చెప్పారు. ఒక పార్టీపై అభిమానంతో వారికి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను మోసం చేసినందుకు... అలాంటి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏ ఎమ్మెల్యేకైనా సొంత పార్టీ నచ్చకపోతే... ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లాలని అన్నారు. వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేగా తన ఒక నెల జీతం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తున్నానని కూనంనేని చెప్పారు. వరదలను కేంద్ర ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి కనీసం రూ. 10 వేల కోట్లను అందించాలని డిమాండ్ చేశారు. ఎన్ కౌంటర్ల పేరుతో మావోయిస్టులను అత్యంత కిరాతకంగా చంపుతూ కేంద్ర ప్రభుత్వం ఆటవిక యుద్ధానికి తెరలేపిందని కూనంనేని విమర్శించారు. ఈ హింసను వెంటనే ఆపేయాలని కోరారు. ఎన్ కౌంటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే మావోయిస్టులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని సూచించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :