Studio18 News - తెలంగాణ / : Telangana Congress New Chief : తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే, రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరి భేటీ గంటపాటు సాగింది. నూతన పీసీసీ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ప్రధానంగా చర్చించారు.
Admin
Studio18 News