Sunday, 08 February 2026 10:16:42 AM
# AP News: 20 ఏళ్లు చిన్నవాడితో వివాహేత‌ర‌ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్యకు వివాహిత కుట్ర! # Chandrababu Naidu: శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం # YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల # Pakistan vs Netherlands: ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ థ్రిల్లింగ్ గెలుపు # Jairam Ramesh: భారత్, అమెరికా ట్రేడ్ డీల్... జైరామ్ రమేశ్ వ్యంగ్యం # KTR: ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్రిప్రమాదంపై కేటీఆర్ అనుమానాలు # Narendra Modi: మలేషియా రాజధానిలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం... స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రధాని అన్వర్ # Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో చైనా పెట్టుబడులు.. అమెరికా భద్రతకు ముప్పంటూ సెనేటర్ల ఆందోళన # Tiger: జనగామ జిల్లాలో మరో రెండు లేగదూడలను చంపిన పులి.. సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానం # Medaram Jatara: జాతర ముగింపు.. టన్నుల కొద్దీ చెత్త, జంతు వ్యర్థాలతో... మురికికూపంలా మేడారం # Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్ # Asha Cheetah: కూనో నేషనల్ పార్కులో ఐదు చీతా కూనల జననం # Vijaya Reddy: పిల్లలతో కలిసి విజయారెడ్డి ఆత్మహత్య: ఆ ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానన్న సోదరుడు # 'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ! # AP SSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షలు... ఇంగ్లీషు పరీక్ష తేదీ మారింది! # Shilpavalli: నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదంపై డీసీపీ ఏమన్నారంటే..! # Zelensky: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా గడువు.. జెలెన్‌స్కీ కీలక ప్రకటన # Srinivas Varma: వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నప్పుడు... జగన్ కు ఏంటి బాధ?: శ్రీనివాసవర్మ # Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ # Vikram Singh: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం.. కారణం వెల్లడించిన ఫైర్ డీజీ విక్రమ్ సింగ్

Chamala Kiran Kumar Reddy: ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చిన గుర్తింపు, బీజేపీలో లేదు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను సాగిస్తోందని విమర్శ పదకొండేళ్లుగా బీజేపీ ఏం చేసిందని నిలదీత తెలంగాణకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుపడుతున

Date : 15 March 2025 01:46 PM Views : 535

Studio18 News - TELANGANA / : బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు, బీజేపీలో లేదని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ చిత్తశుద్ధి లేని పాలనను సాగిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకుంటే రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం సరికాదని అన్నారు. బీజేపీలో గుర్తింపు కోసమే ఆయన 14 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఏం చేసింది, ఏం హామీలను అమలు చేసిందో చెప్పాలని నిలదీశారు. చిత్తశుద్ధి లేని పాలన చేస్తున్నందుకు మొదట ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించాలని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఇప్పటి వరకు ఇందులో తెలంగాణ వాటా 80 లక్షలు రావాలని, అవి ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. బడాబాబులకు వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మాఫీ చేశారని, కానీ పేదవారి అకౌంట్లలో రూ.15 లక్షలు మాత్రం పడలేదని అన్నారు. తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డేనని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని ఆయన అన్నారు. ఈ నెల 22వ తేదీన దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కిషన్ రెడ్డి హాజరు కావాలని, తెలంగాణ రాష్ట్రం తరఫున నిలబడాలని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :