Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్ శివారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో ప్రేమోన్మాది చేతిలో ఓ బ్యూటీషియన్ దారుణ హత్యకు గురైంది. బ్యూటీషియన్ దీపన తమాంగ్(25) మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. ఆమె తన స్నేహితులతో కలిసి గోపన్ పల్లి తండా సమీపంలో ఉంటోంది. కర్ణాటకకు చెందిన రాకేశ్‌తో దీపన తమాంగ్‌కు పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం తర్వాత దీపనను పెళ్లి చేసుకుంటానని రాకేశ్ ఆమెకు చెప్పాడు. అయితే, పెళ్లికి దీపన నిరాకరించడంతో ఆమెపై రాకేశ్ ఆగ్రహం పెంచుకున్నాడు. గత రాత్రి దీపన ఇంటికి వెళ్లి గొడవ పడి, కత్తితో ఆమెపై దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి దీపన తమాంగ్ స్నేహితులు ప్రయత్నించడంతో వారిపై కూడా రాకేశ్ దాడి చేశాడు. దీపన మృతి చెందగా, ఆమె ముగ్గురు స్నేహితులకు గాయాలయ్యాయి. అనంతరం రాకేశ్ మెయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని పోలీసులు కనకమామిడి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు.
Admin
Studio18 News