Studio18 News - తెలంగాణ / : వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ లో సందడి ఒక రేంజ్ లో ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు దశలో జరిగే గణేశుడి లడ్డూ వేలం అందరిలోనూ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రతి ఏడాది కూడా లడ్డూ వేలంపాటలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది కూడా రికార్డులు బ్రేక్ అవుతాయా? అని అందరూ ఎదురు చూశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే సంచలనం నమోదయింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలో ఉన్న కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. ఏకంగా రూ. 1.87 కోట్లకు లడ్డూ అమ్ముడుపోయింది. గత ఏడాది ఇక్కడి లడ్డూ రూ. 1.20 కోట్లు పలికింది. ఈ ఏడాది ఏకంగా రూ. 67 లక్షల మేర పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Admin
Studio18 News