Tuesday, 03 December 2024 03:50:57 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

జైలుకెళ్తే సీఎం కావొచ్చని కేటీఆర్ భావిస్తున్నారు.. కానీ ఆ ఛాన్స్ కవిత కొట్టేశారు: రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవి కోసం పోటీ ఎక్కువగా ఉందన్న సీఎం బీఆర్ఎస్ హయాంలోనూ అదానీకి ప్రాజెక్టులు కట్టబెట్టారని విమర్శ మహారాష్ట్రలో గెలుపుతో స

Date : 25 November 2024 04:31 PM Views : 55

Studio18 News - తెలంగాణ / : జైలుకెళ్తే ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ భావిస్తున్నట్లుగా ఉందని, కానీ కేసీఆర్ కుటుంబంలో ఆ ఛాన్స్ ఆయన చెల్లె కవిత కొట్టేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం అదానీ సంకలో దూరిందని విమర్శించారు. కానీ ఇప్పుడు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పలు ప్రాజెక్టులు కట్టబెట్టారని వివరించారు. వాటిపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేటీఆర్ జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు. 'నేను మొన్న ఓ పెపర్లో చూశాను... జైలుకు వెళ్లి వారంతా (సీఎం) అయ్యారని భావిస్తున్నాడు. ఆ లెక్కన మొదట వారి (కేటీఆర్) చెల్లెలు జైలుకు వెళ్లారు. అలా కూడా కేటీఆర్‌కు అవకాశం రాదు. అలాంటి అవకాశం ఏదైనా ఉంటే ఇప్పటికే ఆ ఛాన్స్ ఆయన చెల్లెలు కొట్టేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవి కోసం పోటీ ఎక్కువగా ఉంది. ఆ ఫ్యామిలీలో పోటీని తట్టుకోలేక మాపై ఏడుపు' అని సీఎం మండిపడ్డారు. కేటీఆర్అమెరికాలో చదువుకున్నాడు... పదేళ్లు మంత్రిగా పని చేశాడు... కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు. మహారాష్ట్రలో గొప్ప విజయం సాధించామని బీజేపీ చెబుతోందని, కానీ రెండు లోక్ సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని గుర్తించాలన్నారు. కర్ణాటకలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, బెంగాల్‌లో ఆరు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ ఎక్కడా గెలవలేదన్నారు. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం మరోసారి నెగ్గింది... ఝార్ఖండ్‌లో తమ ప్రభుత్వం మరోసారి నెగ్గింది... ఇందులో బీజేపీ సంబరాలు చేసుకోవడానికి ఏముందని ప్రశ్నించారు.

Also Read : జగన్ పని అయిపోయినట్టే.. మోదీ కూడా కాపాడలేరు: గోనె ప్రకాశ్ రావు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :