Studio18 News - తెలంగాణ / : Road Accident : నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలం నల్లమలలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని సునిపెంట ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Studio18 News