Studio18 News - తెలంగాణ / : పదవీ కాంక్షతో కేసీఆర్‌ను కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం సాగుతోందని మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ మళ్లీ కనిపించలేదన్నారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఏం చేస్తున్నారో తెలియదన్నారు. తన గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ సీఎంగా భావించి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. గజ్వేల్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని కేటీఆర్ పిచ్చి పిచ్చి రాతలు రాయిస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణం కేటీఆరే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. కవిత బెయిల్ కోసం ప్రధానితో మాట్లాడి ఒప్పందం చేసుకున్నారని, అందుకే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు.
Admin
Studio18 News