Studio18 News - తెలంగాణ / : Harish Rao versus Komati Reddy: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్‌రావు, అధికార సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులకు పొంతన లేదని హరీశ్‌రావు విమర్శించారు. బడ్జెట్‌లో అంకెల గారడీ చేశారని ధ్వజమెత్తారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం చేసుకుంటూ.. ప్రతిపక్ష నేత కేసీఆర్ బడ్జెట్‌పై మాట్లాడతారని తాము ఎదురు చూశామని, తాను ముందుగానే అసెంబ్లీకి వచ్చి కూర్చున్నానని తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చీల్చి చెండారతారని అనుకున్నామన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని, భట్టి బడ్జెట్ అంకెల గారడీ ఆయనకు అర్థం కాలేదని అన్నారు. వెంటనే కోమటిరెడ్డి లేచి హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. హరీశ్‌రావుకు అకారం పెరిగింది కానీ నాలెడ్జ్ లేదని, కేసీఆర్ కేబినెట్‌లో హరీశ్‌రావు డమ్మీ మంత్రి అంటూ ధ్వజమెత్తారు. బడ్జెట్‌పై మాట్లాడకుండా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామన్నారు, కట్టించారా? దళితుడిని సీఎం చేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మరోసారి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడని అన్నారా, లేదా అంటూ కోమటిరెడ్డిని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్లు, సచివాలయాలను కేసీఆర్ అద్బుతంగా కట్టించారని కోమటిరెడ్డి ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. చేతగానమ్మకు మాటలు ఎక్కువ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని హామీయిచ్చారని.. ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో లా లండ్ ఆర్డర్ బాగా దెబ్బతిందని విమర్శించారు.
Admin
Studio18 News