Monday, 16 September 2024 06:54:38 PM
# Manchu Vishnu : మంచు విష్ణు బెస్ట్ ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..? స్పెష‌ల్ పోస్ట్‌తో ఫోటోను షేర్ చేసి.. # Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే? # Shami: అప్పుడే వస్తా.. జట్టులోకి రీఎంట్రీపై మహ్మద్ షమీ కీలక వ్యాఖ్యలు # Jani Master : మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బలవంతం.. సంచలన విషయాలు వెల్లడించిన యువతి.. # Telugu Indian Idol Season 3 : ఫైనల్స్ కి వచ్చేసిన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. విన్నర్ ఎవరో..? # GHMC: గ‌ణేశ్ నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా రోడ్ల‌పై ఆ ఒక్క ప‌ని చేయ‌కండి.. జీహెచ్ఎంసీ విజ్ఞ‌ప్తి! # Chandrababu: ప్రధాని మోదీని కలవడం సంతోషం కలిగించింది: సీఎం చంద్రబాబు # Expensive Cricket Bats: ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన బ్యాట్ వాడిన క్రికెట‌ర్‌ ఎవ‌రో తెలుసా? # Megastar: సీఎం రేవంత్ ను కలిసి చెక్కులు అందించిన చిరంజీవి # Manikonda: వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న టెకీ... ఇంటికి వెళ్లిన కాసేపటికే మృతి # china: చైనాలో బెబింకా టైపూన్ బీభత్సం.. మూతపడ్డ విమానాశ్రయాలు # Allahabad High Court: భయంతో ఉన్న మహిళ సమ్మతితో లైంగిక సంబంధం అన్నది అత్యాచారమే అవుతుంది: అలహాబాద్ హైకోర్టు # Sri Simha: 'మత్తువదలరా 2' మూవీ మండే టాక్! # Asaduddin Owaisi: రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి: అసదుద్దీన్ ఒవైసీ వినతిపత్రం # Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం # KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్ # Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' తేదీలు వ‌చ్చేశాయ్‌.. వారికి ఒక‌రోజు ముందుగానే అందుబాటులోకి సేల్‌! # Indore Horror: 5 నెలల గర్భిణి అయిన స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం.. వీడియోలు చూపిస్తూ బ్లాక్‌మెయిల్ # Rajasthan: రాంగ్ రూట్ లో వెళ్లి ట్రక్కును ఢీ కొట్టిన తుఫాన్ జీప్.. రాజస్థాన్ లో 8 మంది దుర్మరణం # Rajahmundry: రాజమండ్రి శివారులో మళ్లీ కనిపించిన చిరుత .. స్థానికుల్లో ఆందోళన

రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే ప్రమాదం: బోయినపల్లి వినోద్

Date : 10 August 2024 06:06 PM Views : 33

Studio18 News - తెలంగాణ / : కేంద్ర ప్రభుత్వం కొత్తగా భద్రాచలం నుంచి మల్కన్ గిరికి రైల్వే లైన్ మంజూరు చేసిందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. పాండురంగాపురం నుంచి మల్కన్ గిరి వరకు ఈ రైల్వే లైన్ ఉంటుందని చెప్పారు. ఈ రైల్వే లైన్ కు చాలా ప్రాధాన్యం ఉందని, తెలంగాణ ఉద్యమంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని బీఆర్ఎస్ నినాదం ఇచ్చిందని తెలిపారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కోసం గత పదేళ్లుగా బీఆర్ఎస్ పోరాటం చేస్తోందని చెప్పారు. విభజన చట్టంలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కడతామని కేంద్రం చెప్పిందని తెలిపారు. బయ్యారంలో నాణ్యమైన ఉక్కు లేదని సెయిల్ అథారిటీ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. ఎన్.ఎం.డి.సి ఛత్తీస్‌ఢ్‌లో ఉన్న బైలాడిల్లా నుంచి బయ్యారం వరకు రైల్వే లైన్ ఉంటే ఐరన్ ఓర్ సరఫరా చేస్తామని చెప్పిందని తెలిపారు. రైల్వే లైన్ ద్వారా తెలంగాణ ఖనిజ సంపదను గుజరాత్‌కు తరలించే అవకాశం ఉందని అన్నారు. దేశంలో 125 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. స్టీల్ ఉత్పత్తిని 300 టన్నులకు పెంచాలనే ప్రతిపాదన ఉందని అన్నారు. దేశంలో అత్యధికంగా స్టీల్ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతోందని తెలిపారు. బయ్యారంలో తెలంగాణ స్టీల్ ప్లాంట్ అనే పేరుతో ఉక్కు పరిశ్రమను కేంద్రం ప్రారంభించాలని అన్నారు. భద్రాచలం టు మల్కన్ గిరి రైల్వే లైన్ కోసం బీఆర్ఎస్ ఫైట్ చేసిందని చెప్పారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :