Monday, 02 December 2024 12:43:32 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

మేం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తే... మోదీ రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు: రేవంత్ రెడ్డి

మతవిద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఓడించాలని సీఎం పిలుపు మెజార్టీ, మైనార్టీ ప్రజలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్న సీఎం దేశంలో ఉన్నవి మోదీ వర్గం.

Date : 11 November 2024 03:37 PM Views : 79

Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని... కానీ వాటిని రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారిని ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... మెజార్టీ, మైనార్టీ ప్రజలు తమ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారు అన్నారు. స్వాతంత్ర్యం రాగానే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్‌ను విద్యాశాఖ మంత్రిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఆయన విద్యా వ్యవస్థలో ఎన్నో విధానాలు తీసుకువచ్చారన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తోందన్నారు. తమ ప్రభుత్వంలో మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మైనార్టీలకు ఇచ్చామన్నారు. దేశంలో ఉన్నవి రెండే వర్గాలు అని... ఒకటి మోదీ వర్గం కాగా, రెండోది గాంధీ వర్గం అన్నారు. హిందూ, ముస్లిం భాయి భాయి అన్నదే తమ విధానమన్నారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా యాత్ర చేశారని తెలిపారు.

Also Read : రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు రేపు ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :