Monday, 24 March 2025 07:17:38 PM
# Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ # Manchu Vishnu: 'కన్నప్ప’ ప్రయాణంతో శివ భక్తుడిగా మారిపోయాను: మంచు విష్ణు # Hyderabad Lawyer Murder: పట్టపగలు హైదరాబాద్‌లో న్యాయవాది దారుణ హత్య..! # Revanth Reddy: ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు... రేవంత్ కీలక ఆదేశాలు # Chandrababu Naidu: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదు: సీఎం చంద్రబాబు # ఇటుకలు, చెక్క ముక్కలను బంగారంగా మారుస్తున్నారు! ఎక్కడంటే..? # Bank Holiday: మార్చి 25న బ్యాంకులు మూసి ఉంటాయా..? ఉద్యోగుల సమ్మె సంగతేంటి? # Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో శ్రవణ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. వాదనలు ఇలా జరిగాయి.. # Borugadda Anil: బోరుగడ్డ అనిల్ కు హైకోర్టు కీలక ఆదేశాలు # Justice Y V Verma: జడ్జి నివాసంలో నోట్ల కట్టలు... కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు # B.R. Naidu: సీఎం చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ భక్తులు # Ball Tampering: ఐపీఎల్‌లో బాల్ ట్యాంప‌రింగ్‌?... చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబ‌యి ఫ్యాన్స్‌! # Memory Loss: తెలియకుండా ఇలా చేస్తుంటే... జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట! # Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్ # Pawan Kalyan: విజ‌య్ టీవీకే పార్టీపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు... వీడియో వైర‌ల్‌! # Chandrababu Naidu: పార్లమెంటులోని కాఫీ ప్రియులకు శుభవార్త: సీఎం చంద్రబాబు # MLA Raja Singh: బైక్ పైనే తిరుగుతాం.. ఎవరైనా నా ఫ్యామిలీ జోలికి వస్తే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు # Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసు.. పోలీసుల విచారణ అనంతరం యాంకర్ శ్యామల కీలక వ్యాఖ్యలు # Betting apps: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు.. వారిపై చర్యలకు సిద్ధమైన పోలీసులు # Apple iPhone 16 : వావ్.. ఆఫర్ అదిరింది.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 జస్ట్ రూ. 54వేలకే.. ఇలా చేస్తే ఈ ఫోన్ మీ సొంతమే..!

Marriage Dates: కళ్యాణ ఘడియలు షురూ.. మూడూ నెలల్లో 25రోజులు మంచి ముహూర్తాలు.. తేదీలు ఇవే..

Date : 11 October 2024 11:50 AM Views : 130

Studio18 News - TELANGANA / : Wedding Season: పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈనెల 5వ తేదీ నుంచే శుభ ఘడియలు మొదలయ్యాయి. దీంతో పెళ్లి కళ ఉట్టిపడుతోంది. ఈ మూడు నెలలు అంటే అక్టోబర్, నవంబరు, డిసెంబర్‌లో మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చే మూడు నెలల్లో ఒక్క హైదరాబాద్‌ జంటనగరాల్లోనే దాదాపు 10 వేల పెళ్లిళ్లు జరగనున్నట్టు ఫంక్షన్‌హాళ్లు..బ్యాంకెట్‌హాళ్ల నిర్వాహకులు చెబతున్నారు. ఇక అడ్వాన్స్‌ బుకింగ్‌లు కూడా పెరిగాయంటున్నారు. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, మిగతా శుభకార్యాలకు ఈ నెల ఎంతో అనుకూలమైందని పండితులు చెప్తుండటంతో పెళ్లిళ్ల కోసం సన్నాహాలు మొదలుపెట్టేశారు. 25 రోజులు మంచి ముహూర్తాలు.. మంచి ముహూర్తాలు లేక మూడు నెలల నుంచి పెళ్లిళ్లు జరగడం లేదు. ఎప్పుడో మ్యారేజ్ ఫిక్స్ అయిన వారుకూడా శుభ ముహూర్తంకోసం వెయిట్ చేస్తున్నారు. జూన్‌ చివరి నుంచి మంచి రోజులు లేకపోవడంతో వివాహాలు, మిగతా శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నెల నుంచే ముహూర్తాలు ఉండటంతో.. అక్టోబర్‌ నెల రాకముందు నుంచే వివాహం కోసం ఫంక్షన్‌హాళ్లు.. బ్యాంకెట్‌హాళ్లకు బుకింగ్‌లు జరుగుతున్నాయి. అక్టోబర్‌ 12,13,16, 20, 27 తేదీల్లో పెళ్లీలకు ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. ఇక నవంబర్‌లో 3, 7, 8, 9, 10, 13, 14, 16, 17 తేదీలతో పాటు.. డిసెంబర్‌లో పది రోజులు ముహూర్తాలు ఉన్నాయి. మూడు నెలలు కలిపి దాదాపు 25 రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో భాజాభజంత్రీలు, మండపాలను అలంకరించే వారికి, కేటరింగ్‌ వారికి కూడా ఓ రైంజ్‌ లో ఆర్డర్లు మొదలయ్యాయి. దసరా ఉత్సవంతో పాటు శుభకార్యాలకు అనువైన నెల కావడంతో మార్కెట్‌లోనూ సందడి మొదలైంది. షాపింగ్‌ మాల్స్, గోల్డ్‌ షాపుల్లో అమ్మకాలు కూడా భారీగానే పెరిగినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధర పెరిగినప్పటికీ నగలు చేయించుకునేందుకు ఆర్డర్లు వస్తున్నాయని అంటున్నారు. డిసెంబర్‌ 15లోపే శుభ ఘడియలు.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..యావత్‌ దేశంలో ముహూర్తాలు, మంచి రోజులు తప్పనిసరిగా ఫాలో అవుతారు. ఇప్పుడు 25రోజుల పాటు ఉన్న శుభఘడియల్లోనే తమ కూతురు లేదా కొడుకును ఓ ఇంటి వారిని చేయాలని తల్లిదండ్రులు చాలా బిజీగా అయిపోయారు. ఇప్పటికే మ్యారేజ్‌ సెటిల్‌ అయినవారితో పాటు పెండ్లి ప్రయత్నాల్లో ఉన్నవారు కూడా ఈ శుభ ముహుర్తాల్లోనే వివాహం చేసుకోవాలోనే ప్లానింగ్‌లో ఉన్నారు. డిసెంబర్‌ 15లోపే శుభ ఘడియలు ఉంటాయి. ఆ తర్వాత సంక్రాంతి మూఢాలు వస్తే.. మళ్లీ ఫిబ్రవరి మార్చి నెల వరకు ఆగాల్సిందే. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా దాదాపు 35లక్షల పెళ్లిళ్లకు భాజాభజంత్రీలు మోగబోతున్నాయి. దీంతో బట్టలు, ఆభరణాలు, వస్తువులు, అలంకరణ అంటూ హడావుడి మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్‌ను వ్యాపార సంస్థలు అతిపెద్ద బిజినెస్‌గా ఎంచుకున్నారు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లోనే ఏకంగా రూ.4 లక్షల 25వేల కోట్ల పైబడి లావాదేవీలు జరగనున్నాయి. గతేడాదికంటే ఎక్కువ పెండ్లిళ్లు జరిగే ఛాన్స్.. ఈ సీజన్‌లో అక్టోబర్ 12 నుంచి పెళ్లి ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి. గతేడాది ఇదే సీజన్‌ కంటే ఎక్కువగా ఈసారి పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. 2023 ఇదే సీజన్‌లో దాదాపు 35 లక్షల వివాహాలు జరిగాయి. అప్పుడు దాదాపు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈసారి 48 లక్షల పెళ్లిళ్లు జరగడంతో వ్యాపారం మరింత పెరుగుతుందని లెక్కగట్టారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ (CAIT) ప్రకారం ఒక్కో వివాహ వేడుకకు సగటున రూ. 12 లక్షలు ఖర్చు చేస్తున్నారని తెలిపింది. పెళ్లిళ్ల సీజన్‌లో వధూవరులు, కుటుంబ సభ్యులు మాత్రమే కాదు.. ఈ సమయంలో మొత్తం మార్కెట్‌ కూడా పెళ్లి సన్నాహాల్లో పూర్తిగా బిజీగా ఉంటుంది. బంగారం, వెండి, ఆభరణాల కొనుగోళ్లలో ఎక్కువ భాగం వివాహాలదే. పెండ్లి బట్టలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఇండియన్‌ ఫ్యాషన్ డిజైనర్లు, టెక్స్‌టైల్ పరిశ్రమలకు పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. మొత్తం పెళ్లి ఖర్చులో క్యాటరింగ్, కళ్యాణ మండపాలకు 30శాతం ఖర్చు చేస్తున్నట్లు CAIT అంచనా వేస్తుంది. చిన్న వ్యాపారులకు కూడా సువర్ణావకాశం.. పెళ్లిళ్ల సీజన్ అనేది బడా వ్యాపారులకే కాదు చిన్న వ్యాపారులకు కూడా సువర్ణావకాశం. శుభలేఖలు ప్రింట్‌ చేసే ప్రెస్‌లు, ఫోటోగ్రాఫర్లు, టెంట్లు, వంట చేసేవాళ్లు, క్యాటరింగ్‌ బాయ్స్‌, బ్యూటీషియన్లు, మెహందీ ఆర్టిస్టులు, పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్యకారులు, డీజే మ్యూజియషన్లు, స్పీకర్లు అద్దెకు ఇచ్చేవాళ్లు..ఇలా చాలా వస్తువులు, సేవలు పెళ్లిళ్లతో ముడిపడి ఉంటాయి. వెడ్డింగ్‌ సీజన్‌లో ఈ వ్యాపారాన్నీ క్షణం తీరికలేకుండా నడుస్తాయి. ఇక దేశంలో సాధారణ, మధ్యతరగతి ప్రజల పెండ్లి వేడుకలకే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. సెలబ్రిటీలు, ధనవంతులు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ కోసం లెక్కలేనంత డబ్బు దారబోస్తున్నారు. విదేశాల్లో చేసుకునే డెస్టినేషన్​ వెడ్డింగ్‌కు ప్రతీ ఏటా రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇలా మ్యారేజ్‌ అంటే డబ్బుతోనే పని. పసుపు కుంకుమల కింద ఇచ్చే కానుకలతో పాటు పెండ్లి వేడుకను వైభవంగా నిర్వహించడం కోసం వధూవరులు బాగానే ఖర్చు చేస్తున్నారు. ఫ్రీవెడ్డింగ్‌, పోస్ట్ వెడ్డింగ్‌, హల్దీ, ఎంగేజ్‌మెంట్‌, రిసెప్షన్ ఇలా పెండ్లీ అంటేనే అంతులేని ఖర్చు జరుగుతోంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :