Studio18 News - TELANGANA / : తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు అన్నీ బోగస్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ స్పందించారు. ఈ మేరకు వీడియో రూపంలో వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. అయితే ఇవన్నీ బోగస్ కంపెనీలు అని విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని జయేశ్ రంజన్ ఖండించారు. తెలంగాణకు పెట్టుబడులన్నీ వాస్తవమే అన్నారు. పెట్టుబడుల కోసం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అమెరికాలో చేస్తున్న సమావేశాల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాతే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌కు చార్లెస్ స్క్వాబ్ ప్రపంచ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్‌లో తమ సంస్థను నెలకొల్పడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామన్నారు. త్వరలో తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది.
Admin
Studio18 News