Studio18 News - TELANGANA / JAGTIAL : అక్రమంగా మొరం తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు ఆర్డీవో కి వినతి పత్రం అందించిన సంఘటన జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. మెటుపల్లి పట్టణ శివారు వెంకట్రావుపేట రేగుంటలో ఉన్న తమ పొలాలతోవలో గుండుగుట్టలను నిత్యం జెసిబిలతో కొంతమంది గ్రూపులుగా ఏర్పడి నిత్యం మూడు, నాలుగు జేసిబిలు 20 పైగా ట్రాక్టర్లతో మొరము తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఈ మేరకు రాత్రి వేళల్లో అక్రమమోరంను తరలిస్తున్న వాహనాలు అతివేగంగారావడంతో పాటూ ట్రాక్టర్లు తిరగడం మూలాన తమ పంట పొలాలకు వెళ్లే దారి పూర్తిగా ధ్వంసం అయిందని అన్నదాతలు వాపోతున్నారు. అనుభవం లేని డ్రైవర్లతో పంట పొలాల్లో ట్రాక్టర్లు దించడం ద్వారా పంటలు ధ్వంసం అవుతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కాగా ఈ ఘటనపై గతంలో సైతం స్థానిక తాసిల్దార్ కి వినతిపత్రం ఇచ్చిన వారు పట్టించుకోలేదని ఇప్పటికైన సంబందిత అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Admin
Studio18 News