Saturday, 14 December 2024 04:21:20 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Harish Rao: తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏమిటి?: హరీశ్‌రావు ఫైర్

Date : 17 August 2024 12:18 PM Views : 45

Studio18 News - తెలంగాణ / : రైతు రుణమాఫీ వ్య‌వ‌హారం సిద్దిపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తతకు దారితీసింది. రుణమాఫీ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ స్థానికంగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దాంతో వారిని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు అడ్డుకున్నారు. అంతే.. ఈ వివాదం ముదిరి ఇరు పార్టీల‌కు చెందిన‌ మద్దతుదారులు పెద్దఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. అనంత‌రం ఒక‌రిపై ఒక‌రు నినాదాలతో హోరెత్తించారు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను చెదరగొట్టారు. వారిలో కొంద‌రిని స్టేషన్‌కు కూడా తరలించారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు కొంద‌రు హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్‌రావు ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత‌ హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల దాడిని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం ఏంట‌ని, రాష్ట్రంలో అప్ర‌జాస్వామ్య పాల‌న కొన‌సాగుతోందని వి‌మ‌ర్శించారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం అన్నారు. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని, ఈ ఘటనపై డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :