Tuesday, 03 December 2024 03:49:43 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ నదికి మరణశాసనం రాస్తారా?: కేటీఆర్

Date : 14 October 2024 05:09 PM Views : 28

Studio18 News - తెలంగాణ / : వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో ఓ వైపు మూసీ నదికి మరణ శాసనం రాస్తూ మరోవైపు సుందరీకరణ ప్రాజెక్టు అంటారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దామ‌గుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేష‌న్ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. ఈ రాడార్ స్టేష‌న్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతరార్థమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమపై పదేళ్ల పాటు ఒత్తిడి చేసినప్పటికీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అంగీకరించలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏ ప్రయోజనాలను ఆశించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని నిలదీశారు. రాడార్ స్టేషన్‌కు వ్యతిరేకంగా పర్యావరణవేత్తలతో కలిసి పోరాడుతామని హెచ్చరించారు. జ‌నావాసాలు లేని ఇలాంటి రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను తెలంగాణలో ఏర్పాటు చేయడం ఏమిటి? అని ప్రశ్నించారు. దామ‌గుండంలో రాడార్ స్టేష‌న్‌ను తమ పార్టీ వ్య‌తిరేకిస్తోందన్నారు. గంగాన‌దికి ఒక న్యాయం... మూసీకి ఒక న్యాయామా? అని మండిపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :